మోక్ష‌జ్ఞ‌.. వాట్ ఏ మేకొవ‌ర్‌!

నంద‌మూరి వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిటింగ్. ‘ఇదిగో.. అదుగో’ అంటూ బాల‌య్య కూడా వారిని ఊరిస్తూ వ‌చ్చాడు. అయితే… మోక్ష‌జ్ఞ లుక్ వాళ్ల‌ని క‌ల‌వ‌ర‌పెట్టేది. కాస్త బొద్దుగా, ‘హీరో’ అనే మెటీరియ‌ల్ కి కాస్త దూరంగా క‌నిపించేవాడు. అస‌లు మోక్ష‌జ్ఞ‌కి సినిమాల్లోకి వ‌చ్చే ఆస‌క్తి ఉందా, లేదా? అనే అనుమాన‌మూ ఉండేది. కానీ ఇప్పుడు స‌రికొత్త మోక్ష‌జ్ఞ లుక్ బ‌య‌ట‌కు వచ్చింది. త‌న‌ని చూస్తే… ఇంత స‌డ‌న్ గా అంత ఛేంజ్ ఏమిటి? అంటూ ఆశ్చర్యం వేస్తోంది. మేకొవ‌ర్ అంటే ఇదీ.. అనాల‌నిపిస్తోంది. అయితే అందుకు మోక్ష‌జ్ఞ చాలాకాలంగా చ‌మ‌టోడుస్తున్నాడు. ఇప్పుడున్న పోటీలో, త‌ట్టుకోవాలంటే.. నంద‌మూరి లెగ‌స్సీని కాపాడుకొంటూ, ముందుకు న‌డిపించాలంటే ఈ మాత్రం క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌ద‌ని అర్థ‌మైంది. ప్ర‌స్తుతం వైజాగ్ లోని స‌త్యానంద్ ఇనిస్టిట్యూట్‌లో న‌ట‌న‌కు సంబంధించిన త‌ర్ఫీదు పొందుతున్నాడు. అక్క‌డే ఓ ఫిజిక‌ల్ ట్రైన‌ర్ మోక్ష‌జ్ఞ‌ని తీర్చిదిద్దుతున్నాడు. అందుకే ఈ మేకొవ‌ర్ సాధ్య‌మైంది. స‌త్యానంద్ నుంచి వ‌చ్చిన చాలామంది టాప్ స్టార్లుగా మారారు. ముఖ్యంగా వార‌స‌త్వ హీరోల్ని ఆయ‌న స్టార్లుగా తీర్చిదిద్దారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌భాస్‌.. ఈ జాబితాలో చేరే హీరోలే. ఇప్పుడు మోక్ష‌జ్ఞ కూడా అక్క‌డి నుంచే వ‌స్తున్నాడు కాబ‌ట్టి.. ఫ్యాన్స్ లో మ‌రింత భ‌రోసా పెరిగింది.

మోక్ష‌జ్ఞ కోసం ఇప్ప‌టికే ప‌లు స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్ప‌టికే బాల‌య్య‌కు ఓ క‌థ చెప్పి లైన్‌లో పెట్టాడు. బోయ‌పాటి శ్రీ‌నుపై కూడా బాల‌య్య‌కు గురి ఉంది. అయితే బోయ‌పాటి శ్రీ‌ను సినిమా అయితే మాస్‌, యాక్ష‌న్ ఆశిస్తారు. తొలి సినిమాతోనే మోక్ష‌జ్ఞ‌పై అంత ఒత్తిడి తీసుకురావ‌డం బాల‌య్య‌కు ఇష్టం లేదు. అందుకే మోక్షు ఎంట్రీ ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ యేడాది చివ‌రి నాటికి మోక్షు ఎంట్రీ ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

రూ.1000 కోట్ల చేరువలో ‘క‌ల్కి’

'క‌ల్కి' మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర కాబోతోంది. రూ.1000 కోట్ల (షేర్‌) వైపు దూసుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం 'క‌ల్కి' రూ.900 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని అందుకొంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈవారంలో రూ.1000 కోట్లు...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

గెస్ట్ రోల్స్ ఉన్నాయి.. డార్లింగ్‌!

రెండు వారాలుగా 'క‌ల్కి' జాత‌ర కొన‌సాగుతోంది. ఈవారం 'భార‌తీయుడు 2' రాబోతోంది. వ‌చ్చే వారంలో డార్లింగ్ వ‌స్తోంది. 'డార్లింగ్‌' చిన్న సినిమానే అయినా, చాలా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. ప్రియ‌ద‌ర్శి హీరోగా చేసిన సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close