7 మండలాలు కాదు 5 గ్రామాల కోసం రేవంత్

ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే భేటీలో ఏడు మండలాల కోసం పట్టుబట్టాలని .. ముందుగా ఆ అంశం తేల్చిన తర్వాతనే ఇతర అంశాల జోలికి వెళ్లాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే రేవంత్ మాత్రం ఐదు గ్రామాలను ఖచ్చితంగా తెలంగాణకు ఇవ్వాలని పట్టుబట్టనున్నారు. ఇదే అంశాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని పెట్టారు.

భద్రాచలం సమీపంలో ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ ను ప్రభుత్వం చేయబోతోంది. పోలవరం కోసం ఏపీలో ఏడు మండలాలు కలపాల్సి వచ్చినప్పుడు భద్రాచలం ఆలయ ప్రాంతాన్ని తెలంగాణకు వదిలేసి, మిగతా మండలం మొత్తం ఆంధ్రాకు అని చట్టం చేశారు. అంటే భద్రాచలం పట్టణం మాత్రమే తెలంగాణలో ఉంది. పక్కనే ఉన్న ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి కేటాయించారు.

ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగం. గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుంది. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ పని చేయాలంటే ఆ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని అంటున్నారు. ఆ ఐదు గ్రామాల ప్రజలు కూడా తాము తెలంగాణలోనే ఉంటామని వైసీపీ హయాంలో ఉద్యమాలు చేశారు. ఇప్పుడేమంటారో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆస్కార్ మించిపోయే అవార్డులు మ‌న‌మే ఇద్దాం: క‌మ‌ల్‌హాస‌న్

ఆస్కార్ నిజంగానే ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ న‌టుల‌కే ఇస్తుంద‌నుకొంటే ఆ అవార్డ్ క‌నీసం 10 సార్లు అందుకోగ‌ల సామ‌ర్థ్యం ఉన్న న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆస్కార్ లెక్క‌లు,...

గేమ్ ఛేంజ‌ర్‌… శంక‌ర్ కు క్లారిటీ లేదా?

గేమ్ ఛేంజ‌ర్ ఎప్పుడు? ఇది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఈ సినిమా గురించి ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. దిల్ రాజుని ఎప్పుడు రిలీజ్ డేట్ గురించి...

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close