టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టులు !

టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన జగన్ రెడ్డి అభిమానస్తులను పోలీసులు అరెస్టు చేయడం ప్రారంభించారు. మూడు రోజులుగా సీసీ టీవీ ఫుటేజీని సేకరించి… మొత్తం దాడుల్లో పాల్గొన్న వారి వివరాలను రెడీ చేసుకుని అర్థరాత్రి నుంచి వారిని అరెస్టులు చేయడం ప్రారంభించారు. కొంత మందికి మందుస్తుగా సమాచారం రావడంతో పారిపోయారు . ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దొరికిన వారిని దొరికినట్లుగాఅరెస్టు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన వారినే ఎక్కువగాఅరెస్టు చేస్తున్నారు.

మూడేళ్ల కిందట జగన్‌ను ఏదో అన్నారని చెప్పి టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేశార. దేవినేని అవినాష్ , లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిల నేతృత్వంలో వారి ముఖ్య అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. ముందే తెలిసిన పోలీసులు …దాడి జరిగే వరకూ ఆ వైపు కూడా కూడా రాలేదు. టీడీపీ ఆఫీసులో విధ్వంసం చేస్తూ ఓ ఎస్ఐ దొరికాడు కూడా. టీడీపీపై దాడి ఘటనలో సాదాసీదా కేసులు పెట్టారు. కనీస విచారణ చేయలేదు. నిందితుల్ని పట్టుకోలేదు. కానీ సీసీ ఫుటేజీలో నిందితులు అడ్డంగా దొరికిపోయారు.

ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆ కేసులో కదలిక వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. వారు టీడీపీ ఆఫీసుకు వచ్చి సీసీ ఫుటేజీ తీసుకుని నిందితుల్ని గుర్తించి అరెస్టులు ప్రారంభించారు. ఈ దాడి తాడేపల్లి ప్యాలెస్ డైరక్షన్ లో జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు విచారణలో అసలు కోణాన్ని వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close