సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో పట్టు సాధిస్తూనే, అధినాయకత్వం దగ్గర మరింత పరపతి సంపాదిస్తున్నట్లు కనపడుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కీలకమైన ఎంపీ స్థానాల విషయంలో రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్… రెండు విధాలుగా వర్కవుట్ అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకోలేకపోయినా… గ్రౌండ్ లో కేసీఆర్ కు ఇంకా పట్టుంది. ఆ విషయం రేవంత్ రెడ్డికీ తెలుసు. కీలకమైన నాయకులు పార్టీ మారుతుంటే గ్రౌండ్ తో పాటు కిందిస్థాయి క్యాడర్ కూడా పార్టీ మారక తప్పదు. అప్పుడు పార్టీ ఆటోమేటిక్ గా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్న ఎంపీ కేశవరావును కాంగ్రెస్ లోకి తీసుకరావటంతో రేవంత్ సక్సెస్ అయ్యారు.
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశవరావు పార్టీ మారాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. లేదా అధికారికంగా కండువా కప్పుకోకుండా ఉండాలి. అయితే, తాను కాంగ్రెస్ లో పుట్టి పెరిగానని, కాంగ్రెస్ లోనే చనిపోవాలన్న ఉద్దేశంతో పార్టీ మారానని ఆయన చెప్పుకున్నారు.
ఎంపీ పదవికి రాజీనామా చేసి కేకే పార్టీ మారిన… తనకు మళ్లీ అవకాశం దక్కనుంది. తెలంగాణలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కే ఉన్నాయి కాబట్టి కేకే రాజీనామాతో వచ్చే రాజ్యసభ ఉప ఎన్నిక సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్తుంది. అప్పుడు కేకే మరోసారి అవకాశం ఇస్తే… తన ఎంపీ సీటు తనకే ఉంటుంది. సో… కేకే పార్టీ మారటం వల్ల తన ఎంపీ పదవికి వచ్చిన నష్టమేమీ లేదు. పైగా తన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గా బీఆర్ఎస్ లీడర్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయింది.
కేకే రావటం అటు కాంగ్రెస్ అధినాయకత్వంకు కూడా కలిసొచ్చేదే. పార్టీకి రాజ్యసభలో బలం క్రమంగా తగ్గుతుంది. అలాంటి సమయంలో తమకో సీటు రావటం మంచిదే అన్న భావనలో ఖర్గే ఉన్నారని, కేకే తిరిగి సొంతగూటికి రావటం గాంధీ కుటుంబానికి కూడా అభ్యంతరం లేదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్ లో అధిష్టానం వద్ద రేవంత్ కు మంచి మార్కులు పడ్డట్లే.