కొబ్బ‌రికాయ కొట్టారు… రిలీజ్ డేట్ చెప్పారు!

ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లేంత వ‌ర‌కే నిర్మాత చేతిల్లో ఉంటుంది. రిలీజ్ డేట్ పరిస్థితుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డం, ఆ త‌ర‌వాత వాయిదా వేయ‌డం ఈమ‌ధ్య మ‌రీ కామ‌న్ అయిపోయింది. అందుకే సినిమా హిట్టు.. అని చెప్పేంత న‌మ్మ‌కంగా రిలీజ్ డేట్ డిక్లేర్ చేయ‌లేరు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమా మొద‌లెట్టిన రోజే, రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డం అరుదైన సంగ‌తే. విశ్వ‌క్ సేన్ ఇప్పుడు అదే బాట‌లో వెళ్తున్నాడు. విశ్వ‌క్ కొత్త సినిమా ‘లైలా’ ఈరోజే షూటింగ్ ప్రారంభించుకొంది. విశ్వ‌క్ తొలిసారి లేడీ గెట‌ప్పులో క‌నిపించ‌నున్న సినిమా ఇది. ఫ‌స్ట్ లుక్ లో క‌నీక‌నిపించ‌కుండా క‌వ్విస్తున్నాడు విశ్వ‌క్‌. కొబ్బ‌రికాయ కొట్టిన రోజే నిర్మాత‌ ధైర్యంగా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించేశారు. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. అంటే… 8 నెల‌ల్లో సినిమా మొత్తం రెడీ అయిపోతుంద‌న్న మాట‌.

సాహు గార‌పాటి నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. రామ్ నారాయ‌ణ ద‌ర్శ‌కుడు. ఆకాంక్ష శ‌ర్మ‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. ఆమెకు ఇదే తొలి సినిమా. హీరోలు లేడీ గెట‌ప్పులు వేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్లుగా నిలిచాయి. అయితే ఓ మాస్ హీరో లేడీ గెట‌ప్ వేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు విశ్వ‌క్ ఆ లోటు తీరుస్తున్నాడు. మ‌రి ఈ లైలా విశ్వ‌క్‌కు ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపకు ఉపఎన్నికలు వస్తే ప్రచారం చేస్తా : రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిల కోసం నేరుగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ జయంతి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కడపకు ఉప...

బీజేపీతో అంటకాగేవాళ్లు వైఎస్ వారసులా ? : షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో ఆయనకు తానే రాజకీయ వారసురాలినని షర్మిల నేరుగా సందేశం ఇచ్చారు. ఇవ్వాళ YSR వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు BJP...

డ్ర‌గ్స్‌పై పోరుకు టాలీవుడ్ సిద్ధం

డ్ర‌గ్స్ మహ‌మ్మారిని త‌రిమికొట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకొంటోంది. డ్ర‌గ్స్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ ఉద్య‌మంలో చిత్ర‌సీమ కూడా పాలుపంచుకోవాల‌ని ఇటీవ‌ల తెలంగాణ సీఎం...

అడుసు తొక్కనేలా.. కోర్టుల చుట్టూ తిరగనేలా?

వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హైకోర్టు వైపు పరుగులు పెడుతున్నారు. ఒకరు ముందస్తు బెయిల్ కావాలని.. మరొకరు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. ఇంకొందరూ అదే లైన్ లో ఉన్నారు. వరుసగా వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close