తేజ్ సినిమా రూ.120 కోట్లా?

పాన్ ఇండియా మార్కెట్ ఇచ్చిన ధైర్యంతో మీడియం రేంజ్ హీరోల సినిమాల బడ్జెట్ల‌కూ రెక్క‌లొచ్చేశాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ రూ.30, రూ.40 కోట్ల మ‌ధ్య తిరిగిన హీరోలంతా ఇప్పుడు వంద కోట్ల మార్క్ కు చేరుకొంటున్నాయి. తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా బ‌డ్జెట్ కూడా సెంచ‌రీ దాటేసింది.

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా రోహిత్ కె.పి. ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల ఓ సినిమా ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ‘హ‌నుమాన్‌’ ఫేమ్ కె.నిరంజ‌న్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ తో క‌లిసి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం రూ.120 కోట్ల బ‌డ్జెట్ కేటాయించార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తేజ్ కెరీర్‌లో ఇదే భారీ బ‌డ్జెట్ సినిమా. ‘విరూపాక్ష‌’తో ఇటీవ‌లే ఓ మంచి హిట్ కొట్టాడు తేజ్‌. ఆ న‌మ్మ‌కంతోనే ఈ సినిమాపై భారీగా ఖ‌ర్చు పెట్ట‌డానికి నిర్మాత‌లు సిద్ద‌మైపోయారు. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ లో ఏకంగా ఆరేడు సెట్లు తీర్చిదిద్దుతున్నారు. సెట్ల‌కే దాదాపు రూ.20 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చువుతుంద‌ని టాక్‌. ఇందులో ఓ ప‌ల్లెటూరు సెట్ కూడా ఉంది. ఈ చిత్రం కోసం ‘సంబ‌రాల ఏటిగ‌ట్టు’ అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపకు ఉపఎన్నికలు వస్తే ప్రచారం చేస్తా : రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిల కోసం నేరుగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ జయంతి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కడపకు ఉప...

బీజేపీతో అంటకాగేవాళ్లు వైఎస్ వారసులా ? : షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో ఆయనకు తానే రాజకీయ వారసురాలినని షర్మిల నేరుగా సందేశం ఇచ్చారు. ఇవ్వాళ YSR వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు BJP...

డ్ర‌గ్స్‌పై పోరుకు టాలీవుడ్ సిద్ధం

డ్ర‌గ్స్ మహ‌మ్మారిని త‌రిమికొట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకొంటోంది. డ్ర‌గ్స్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఈ ఉద్య‌మంలో చిత్ర‌సీమ కూడా పాలుపంచుకోవాల‌ని ఇటీవ‌ల తెలంగాణ సీఎం...

అడుసు తొక్కనేలా.. కోర్టుల చుట్టూ తిరగనేలా?

వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హైకోర్టు వైపు పరుగులు పెడుతున్నారు. ఒకరు ముందస్తు బెయిల్ కావాలని.. మరొకరు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. ఇంకొందరూ అదే లైన్ లో ఉన్నారు. వరుసగా వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close