ఏపీలో మెగా డీఎస్సీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 16,347పోస్టులతో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే, పరీక్షకు సన్నద్ధం అయ్యేందుకు తమకు సమయం కావాలని, పైగా టెట్ పరీక్షను నిర్వహించి… ఆ తర్వాత సమయం ఇచ్చి, డీఎస్సీ నిర్వహించాలని అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు.
అభ్యర్థుల కోరిక మేరకు, వారికి చదువుకునే సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో… మొదట టెట్ నిర్వహిస్తామని అందుకు కనీసం 90రోజుల సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాత డీఎస్సీకి మరో 90రోజుల సమయం ఇచ్చేందుకు ఓకే అన్నారు.
త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని… మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి కొత్త టీచర్లకు నియామక పత్రాలు ఇచ్చేలా కార్యచరణను త్వరలోనే విడుదల చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.