జగన్ హయాంలో టూరిజం పేరుతో భయంకరమైన దోపిడీ జరిగింది. తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. అందరికీ టూరిజం పేరుతో జరిగిన రుషికొండ ప్యాలెస్ స్కామే కనిపిస్తోంది కానీ అడుగడుగునా దోపిడీనే జరిగింది. ఇవన్నీ ఆ శాఖ మంత్రి రోజాకు తెలుసో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వైసీపీ హయాంలో మంత్రులకు ఎలాంటి స్వేచ్చ లేదు. రోజాకు తిరుమల దర్శనం టిక్కెట్ల సంగతి చూసుకోమని చెప్పి.. ఇతర వ్యవహారాలన్నీ తామే నడిపారు.
తాజాగా పులివెందులలో ఓ వైసీపీ నాయకుడు కట్టి మధ్యలో వదిలేసిన భవనాన్ని ఫోర్ స్టార్ హోటల్ పేరుతో కొనేశారు. దాదాపుగా పదిహేను కోట్లు చెల్లించేశారు. అసలు టూరిజం రిసార్టులకు మరమ్మతులకు కూడా డబ్బుల్లేవని గగ్గోలు పెడుతూంటారు.కానీ ఈ లావాదేవీ ఎప్పుడు పూర్తి చేశారో ఎవరికీ తెలియదు. కానీ అయిపోయింది. ఉన్నతాధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. పులివెందులలో సగం కట్టిన బిల్డింగ్ ను పదిహేను కోట్ల వరకూ పెట్టి కొనడం ఏందో..దాన్ని ఫోరో స్టార్ హోటల్‌గా చెప్పడం ఏమిటో ఎవరికీ అర్థం కాని విషయం.
దీని లెక్కలు కూడా బయటకు తీస్తున్నారు. వైసీపీ నాయకుడికి డబ్బుల చెల్లించి అందులో ఎవరు కమిషన్లు తీసుకున్నారో బయటకు తీస్తున్నారు . అయితే అధికారికంగా మాత్రం.. ఈ వ్యవహారం రోజా మెడకే చెట్టుకుంటుంది. ఎందుకంటే ఆమె పర్యాటక మంత్రి. పర్యాటక శాఖలో తవ్వేకొద్దీ ఎన్నో ఘోరాలు ఉన్నాయని.. మంత్రి కందుల దుర్గేష్ చెబుతున్నారు. వీటిపై చిరంజీవి, పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలంటున్నారు.