ఏపీలో కొంతమంది నేతలు గిల్లికజ్జాలు ఇంకా మానడం లేదు. ఇలా వ్యవహరిస్తోన్న నేతలకు టీడీపీ నేతలు అదే తరహలో కౌంటర్ ఇచ్చి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ కార్పొరేటర్ కు టీడీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కడప సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి , కార్పొరేటర్ ఉమాదేవి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 49వ డివిజన్ లో ఫించన్ లు పంపిణీ చేశారని, తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యేను కార్పొరేటర్ ప్రశ్నించారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఫించన్లు ఎలా ఇస్తారని నిలదీయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మాధవీ రెడ్డి..కార్పొరేటర్ ను కాసేపు తన వాగ్ధాటితో వణికించారు .
మీరేమైనా కార్పోరేషన్ కొన్నారా..? మీ పేరుపై రాయించుకున్నారా..? అని గట్టిగానే వాయించేశారు. 50డివిజన్లు ఉన్న కడప కార్పోరేషన్ లో అందరూ వచ్చారని , మీరు ఒక్కరే రాలేదని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని, ఎవరింట్లో పెళ్లి కాదని, కార్డు ఇచ్చి పిలవడానికి అంటూ వ్యాఖ్యానించడంతో కార్పొరేటర్ మారుమాట మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు.