సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలి, నేతలను చేజారనివ్వొద్దన్న లక్ష్యంతో కేసీఆర్ గతానికి భిన్నంగా నేతలను కలుస్తున్నారు. సామాన్య కార్యకర్తలతో ఫోటోలు దిగుతున్నారు.
కానీ, సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాంతో ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ జాగ్రత్తపడితే… రేవంత్ ఎమ్మెల్సీలపై గురిపెట్టారు. ఏకంగా ఓకేసారి 6గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ రావు
ప్రభాకర్ రావు
దండే విఠల్
ఎగ్గే మల్లేశం
దయానంద్
బస్వరాజు సారయ్యలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం మండలిలో ఏకంగా 12కు చేరింది.
ఇప్పటి వరకు కేవలం అసెంబ్లీలో మాత్రమే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటారు, మండలిలో ప్రతిఘటించవచ్చు అని బీఆర్ఎస్ భావిస్తూ ఉండగా, రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే మండలిలోనూ బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే ఎత్తుగడ ఉన్నట్లు కనపడుతోంది.