అమరావతియే ఆంధ్రకు రాజధాని. జగన్ గొంతు పిసికే ప్రయత్నం చేసినా, జనం తన ఆటలు సాగనివ్వలేదు. అమరావతి నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకోవటమే కాదు అమరావతిని నిలబెడుతానంటూ కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబు… పని మొదలుపెట్టారు. తనకున్న అనుభవంతో ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తున్నారు.
ఏపీలో ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ పెట్టేందుకు ఎక్స్ ఎల్ఆర్ఐ విద్యాసంస్థ ముందుకొచ్చింది. అమరావతిలో దాదాపు 250కోట్లతో ఈ బిజినెస్ స్కూల్ నెలకొల్పనుంది. దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ఈ విద్యాసంస్థ అమరావతిలో క్యాంపస్ పెట్టడానికి 2018లోనే ముందుకొచ్చినా, ప్రభుత్వం మారటంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ ముందుకు రావటంతో తుళ్లూరు మండలంలో ఆ క్యాంపస్ కు సర్కార్ 50ఎకరాలు కేటాయించింది.
ఈ నిర్మాణం పూర్తైతే ఒకేసారి 5వేల మంది రాష్ట్ర, దేశీ, విదేశీ విద్యార్థులు ఈ క్యాంపస్ లో చదువుకునే వీలు కలుగుతుంది. ప్రభుత్వం మారటం, అమరావతిపై నిర్లక్ష్యంతో వెనక్కి తగ్గిన సంస్థలతో ఏపీ సీఆర్డీయే చర్చలు జరపటం, ప్రభుత్వ పెద్దల హామీలతో ఆనాటి సంస్థలు ఒక్కొక్కటిగా అమరావతికి తరలివస్తున్నాయి.