ఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హతా వేటు వేయాలని బీజేపీ కూడా పట్టుబడుతోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం కింద ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ స్పీడ్ పోస్టును స్పీకర్ కార్యాలయం తీసుకోలేదు. రిటర్న్ రావడంతో ఇదే కారణం చెప్పి కోర్టులో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతోంది. తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరారు కాబట్టి బీఆర్ఎస్కు కోపం ఉంటుంది. మరి బీజేపీకి ఎందుకు కోపం ? నాగేందర్ ఒక్కరిపైనే అనర్హతా వేటు కోసం పట్టుబట్టడం ఎందుకు ?
దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచినంత పని చేశారు. బీఆర్ఎస్ మధ్యలో చేతులెత్తేయడంతో సరిపోయింది కానీ లేకపోతే గెలిచేవారు. కేవలం యాభై వేల ఓట్ల తేడాతోనే కిషన్ రెడ్డి బయట పడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు లక్షా 30వేల ఓట్లు కూడా రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడ గెలవలేదు. కానీ దానం మాత్రం ఎంపీ అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చారు. కిషన్ రెడ్డికి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు దానం ముందే చేతులు ఎత్తేశారని ప్రచారం చేయడం కూడా దానంకు మైనస్ అయింది.
ఎలా చూసినా దానం ఎఫెక్ట్ బీజేపీపై గట్టిగానే పడింది. అందుకే ఆయనకు ఎమ్మెల్యే పదవి ఊడగొట్టాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మొత్తం పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ఇవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకే… ముందు జాగ్రత్తగా దానంను డిఫెన్స్ లో పడేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు.