ఏపీలో అధికారుల పోస్టింగ్స్ పై మీడియా, సోషల్ మీడియాల్లో కొంత మంది చెలరేగిపోతున్నారు.. వైసీపీ హయాంలో వారు ఫలానా సమయంలో ఇలా చేశారు.. వారికి ఇప్పుడు కీలక బాధ్యతలు ఇచ్చారు అని నిందిస్తున్నారు . అధికార యంత్రాంగంలో ఎవరు తప్పు చేశారో… ఎలా చేశారో.. పాలనలో వారిని వాడుకోవాలో తమకు తెలిసినంతగా చంద్రబాబుకు తెలియదని వారు ఫీలవుతున్నారు. అందుకే ప్రతీ రోజూ వారినక్కడెందుకు పెట్టారు.. ఇక్కడెందుకు పెట్టారని స్టోరీలు అల్లేస్తున్నారు.
ఏ ప్రభుత్వంలో అయినా ఉన్నవారితోనే చేయించుకోవాలి. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు .. తమ పోస్టింగుల కోసమే కాదు.. తమపై కేసులు పడకుండా.. తప్పుడు కేసులతో వేధింపులకు గురి కాకుండా ఉండటానికి కూడా చాలా మంది చెప్పినట్లుగా చేశారు. వారు తప్పులు చేస్తే ప్రభుత్వ పెద్దలు కూడా కాపాడలేరు. చంద్రబాబు కూడాఅదే చెబుతున్నారు. తప్పులు క్షమిస్తే అలవాటుగా మారుతాయని అంటున్నారు.
పూర్తి స్థాయిలో గీత దాటిన అధికారుల్ని ఇప్పటికే పక్కన పెట్టారు. వారు చేసిన పాపాల చిట్టా రెడీ అవుతోంది. ఇక ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా ఉల్లంఘనలకు పాల్పడిన సమర్థులైన అధికారుల్ని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. వారికి పోస్టింగులు ఇచ్చినంత మాత్రాన వారు చేసిన తప్పుల్ని సమర్థించినట్లు కాదుకదా. అయినా ఆయా అధికారుల గురించి చంద్రబాబు కన్నా.. లోకేష్ కన్నా తమకే ఎక్కువ తెలుసన్నట్లుగా కొంత మంది చెలరేగిపోతున్నారు.