చిరంజీవి క‌థ‌… చ‌ర‌ణ్‌కి సెట్ అవుతుందా?

‘మ‌హాన‌టి’ విడుద‌లైన త‌ర‌వాత‌… చిత్ర‌బృందాన్ని ఇంటికి పిలిచి మ‌రీ అభినందించారు చిరంజీవి. అప్పుడే చిరంజీవి – నాగ్ అశ్విన్ కాంబో తెర‌పైకి వ‌చ్చింది. చిరంజీవి కోసం తాను ఓ క‌థ సిద్ధం చేస్తున్నాన‌ని ఆ సంద‌ర్భంలోనే చెప్పేశారు నాగ అశ్విన్‌. అది ‘పాతాళ భైర‌వి’లాంటి సినిమా అని, మాంఛి సోషియో ఫాంట‌సీ అని హింట్ ఇచ్చారు చిరంజీవి. దాంతో ఈ కాంబోపై ఆస‌క్తి రేగింది.

‘క‌ల్కి’ కథ ముందుగా చిరంజీవికే చెప్పార‌ని, అయితే ఈ క‌థ త‌న‌కు సైట్ అవ్వ‌ద‌ని, ప్ర‌భాస్‌కి చేస్తే బాగుంటుంద‌ని, చిరు స‌ల‌హా ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ‘క‌ల్కి’ క‌థ‌కూ చిరంజీవికి సంబంధం లేదు. అస‌లు ఈ క‌థ చిరంజీవి వ‌ర‌కూ వెళ్ల‌నేలేద‌ని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. మ‌రి చిరంజీవి క‌థ ఏమైంది?

ఈ క‌థ అలానే ఉంది. వైజ‌యంతీ మూవీస్ ఈ క‌థ‌ని వెండి తెర‌పై తీసుకొచ్చే ఆలోచ‌న‌ల్లో ఉంది. ‘క‌ల్కి 2’ పూర్త‌య్యేస‌రికి మ‌రో రెండేళ్లు ప‌డుతుంది. ఆ త‌ర‌వాత చిరు కోసం రాసుకొన్న క‌థ తీసే అవ‌కాశం ఉంది. అయితే అప్పుడు చిరు హీరో కాక‌పోవొచ్చు. అదే క‌థ‌ని రామ్ చ‌ర‌ణ్‌తో తీసే ఛాన్స్ వుంది. ఎందుకంటే ‘జ‌గదేక వీరుడు – అతిలోక సుంద‌రి’ త‌ర‌వాత‌ ఫాంట‌సీ క‌థ‌ల్లో న‌టించ‌లేద‌న్న అసంతృప్తి చిరంజీవికి ఉంది. అది కాస్త ‘విశ్వంభ‌ర‌’లో తీరిపోతోంది. అందుకే ఈ జోన‌ర్‌ని చిరు మ‌ళ్లీ ఇప్ప‌ట్లో ట‌చ్ చేసే అవ‌కాశం లేదు. కానీ చ‌ర‌ణ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి క‌థ చేయ‌లేదు. కాబ‌ట్టి నాగ్ అశ్విన్ ఈ క‌థ‌ని చ‌ర‌ణ్‌తో చేసే అవ‌కాశాలే ఎక్కువ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. చ‌ర‌ణ్ – నాగ్ అశ్విన్ ఈ కాంబో కూడా క్రేజీగానే ఉంటుంది. అందులో డౌటే లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close