” బాగుపడండ్రా అని సలహాలు ఇస్తూంటే.. వాళ్లు మాత్రం తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే మళ్లీ కోలుకోలేరు ” అని ఉచిత సలహాలు ఇచ్చి పాటించకపోతే నిష్ఠూరాలు ఆడేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారిలో కొంత మంది అభిమానస్తులకు ఇస్తారు… వ్యతిరికేస్తులకూ ఇస్తారు. ఇలాంటి వారిలో ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఒకరు. రాజకీయాలు మారిపోవడంతో ప్రతీ వారం వారాంతాంలో ఏమి రాయాలో తెలియక… సలహాలు ఇచ్చేందుకు సమయం కేటాయిస్తున్నారు. ఈ వారం కూడా ఆయన అంతే. తన ఆర్టికల్ నిండా ఉచిత సలహాల్ని నింపేశారు. వాళ్లూ వీళ్లు అనే తేడా లేదు… అభిమానస్తులకు… వ్యతేరికస్తులకూ ఇచ్చేశారు.
కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుని తన ఓటమితో దేశమంతా బాధపడిపోతోదంని తన వద్ద వచ్చే పార్టీ నేతలకు చెబుతున్నారని.. ఆయనకు ఇంకా సినిమా అర్థం కాలేదని ఆర్కే బాధపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఎన్టీఆర్ కూడా బావుకున్నదేమీ లేదని.. అక్కడంతా నెంబర్ అని కొత్తగా చెప్పారు. నిజానికి రాజకీయాల్లో పండిపోయిన కేసీఆర్కు అది తెలియదా ?. ఆయన రాజకీయ వ్యూహం ఆయన అమలు చేశారు. గెలిచినప్పుడు చాణక్యుడని పొగడటం.. ఓడిపోయినప్పుడు చాణక్యుడి డూప్ అని పొగడటం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆర్కే అదే చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ లో ఉన్నప్పుడు చంద్రబాబును మించిన తెలివి తేటలున్న నేత అని పొగిడేవారు.. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రకటనలు మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. అందుకే మారిపోవాలని సలహా ఇచ్చేశారు.
ఏపీలో జగన్ కూ ఓ సలహా ఇచ్చేశారు. కాకపోతే జగన్ గురించి ఆర్కే ఎక్స్ ప్రెస్ చేసే అభిప్రాయాల్లో కాస్త వైల్డ్ నెస్ ఉంటుంది. అందుకే ఎవరికైనా చూపించండ్రా అని సలహా ఇచ్చారు ఆ పార్టీ నేతలకు. జగన్ కొత్తగా తన టాలెంట్ చూపించలేదు. మొదటి నుంచి ఆయన మనస్థత్వం అదే. అలాగే మాట్లాడతారని అందరికీ తెలుసు. తప్పులు చేశాననని ఒప్పుకునే రకం కాదు. కానీ ఆర్కే తప్పులు ఒప్పకుని కొత్తగా ప్రారంభించేయమని సలహాలిస్తారు. ఎంత ఓడిపోయిన బాధలో ఉన్నా.. ఆర్కే తన శ్రేయోభిలాషిగా మారిపోయి సలహాలిచ్చారంటే.. జగన్ నమ్మేస్తారా ? . ఆర్కే తాపత్రయమే కానీ.. జగన్ రాజకీయం … మారదు. జగన్ బీభత్సంగా గెలిచినప్పుడు.. అంతకు ముందు కూడా.. అసలు ఆయనకు రాజకీయం తెలియదని… అన్నీ సెల్ఫ్ గోల్సేనని గోల చేశారు. కానీ గెలిచాక జగన్ మామూలోడు కాదని పొగిడారు. మళ్లీ ఇప్పుడు జగన్ కేమీ తెలియదు..తాను చెబుతున్నాను తెలుసుకోవాలని సందేశమిస్తున్నారు.
ఇద్దరికీ సలహాలిచ్చినా తన ఆర్టికల్ స్పేస్ సరిపోలేదని.. కూటమి ప్రభుత్వానికి సలహాలిచ్చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు చాలా తప్పు చేశారని తేల్చారు. అలాగే మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఎస్ఐను గదమాయించిందని.. అలాంటివి చేయకూడదని చెప్పుకొచ్చారు. ఇలాంటివి కట్టడి చేసుకోవాలని లేకపోతే… జగన్ కు మీకూ తేడా ఏమిటని కూడా వాదించే ప్రయత్నం చేశారు. ఎంతైనా ఆర్కే ఇప్పుడు తనను తాను న్యూట్రల్… అందరి శ్రేయోభిలాషినని చెప్పుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు . కానీ ఆ విషయం అందరికీ తెలుసు కదా అనేదే ఎక్కువ మంది కమెంట్…!