హహునుమన్ లాంటి విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కె నిరంజన్ రెడ్డి నిర్మాణంలో వస్తోన్న చిత్రం డార్లింగ్. ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ట్రైలర్ వదిలారు. కథ సెంట్రల్ ఐడియాని ట్రైలర్ లో చూపించారు.
ప్రియదర్శి ఓ అమాయకుడు. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకొని భార్యని పారిస్ కి హనీమూన్ కి తీసుకెళ్లడం అతని కల. అలా నభా తన జీవితంలోకి వస్తోంది. అయితే ఇక్కడే మరో మలుపు. తనకి భార్యగా వచ్చింది ఓ అపరిచితురాలు. తనకి స్ప్లిట్ పర్సనాలిటీ వుంటుంది. తర్వాత అలాంటి అపరిచితురాలితో భర్త ఎలాంటి తిప్పలు పడ్డాడనేది ఫన్నీగా ట్రీట్ చేశారు.
ట్రైలర్ లో హ్యుమర్, ఎంటర్ టైన్మెంట్ డీసెంట్ గా వున్నాయి. ప్రియదర్శి కంటే నభాకి ఎక్కువ స్పెస్ వున్నట్లుగా అనిపిస్తోంది. బ్రహ్మానందం, అనన్య కూడా కీలక పాత్రల్లో మెరిశారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చి చాలా కాలమైయింది, మరీ లోటు డార్లింగ్ తీరుస్తుందేమో చూడాలి. జూలై 19న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.