తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవాడలో జరిగే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూతురు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు ఆయనతో సాన్నిహిత్యం ఉన్న అందరినీ ఆహ్వానించారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య అభిప్రాయబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో… వైఎస్ లెగసీని కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా షర్మిల ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో మీ రాజన్న బిడ్డ అంటూ ప్రచారం చేశారు. కానీ మొన్నటి ఎన్నికలు ప్రత్యేక సందర్భంలో జరిగాయి. కూటమికి వన్ సైడ్ ఓట్లు పడటం ముందే ఖాయం అయ్యింది. కానీ, భవిష్యత్ లో ఇదే నినాదంతోనే ముందుకు వెళ్లాలన్న అధిష్టానం అభిప్రాయం నేపథ్యంలో… షర్మిల కూడా దూకుడుగానే వెళ్తున్నారు.
ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కూడా హజరుకాబోతుండగా… ఇదే వేదికపై కేవీపీ కూడా అటెండ్ కాబోతున్నారు. కేవీపీని బూచీగా చూపించి విమర్శలు చేసే బీఆర్ఎస్… ఇప్పుడు మరోసారి విమర్శలు గుప్పించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.