ఆయా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు నెలసరి సెలవులు మంచివే కానీ అది వారి భవిష్యత్ కు ప్రమాదం అని అభిప్రాయపడింది.
రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నెలసరి సెలవులు అమలు చేస్తున్నాయని, దీన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆదేశించాలని దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరిపింది.
నెలసరి సెలువులు తప్పనిసరి చేస్తే ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహించినట్లు అవుతుంది. కానీ ఈ నిర్ణయం వల్ల భవిష్యత్ లో మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు సంస్థలు ముందుకు రాకపోవచ్చని… పైగా ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి ఆయా ప్రభుత్వాలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పిటీషనర్లకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని కేంద్ర స్త్రీ-శిశు సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.
ఇప్పటి వరకు మహిళా ఉద్యోగులకు బీహార్ రెండు రోజుల పాటు నెలసరి సెలవులను అధికారికంగా మంజూరు చేస్తుండగా, కేరళ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థులకు మూడు రోజుల నెలసరి సెలవులు అమల్లో ఉన్నాయి.