తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షర్మిల కోసం నేరుగా రంగంలోకి దిగుతానని ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ జయంతి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కడపకు ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు .. నిజంగా ఉప ఎన్నికలు వస్తె కడప లో గల్లి గల్లి తిరిగే భాధ్యత నేను తీసుకుంటానని ప్రకటించారు. ఎక్కడ పొగుట్టుకున్నాం అక్కడ నుంచే గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. షర్మిల ప్రయత్నాలను బలోపేతం చేస్తామని భరోససా ఇచ్చారు.
ఏపిలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిల నేనని రేవంత్ స్పష్ట చేశారు. ఏపీలో బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ అన్నారు. ఇక్కడ అంతా పాలక పక్షమే ఉందని.. ప్రజల పక్షం వైఎస్ షర్మిల మాత్రమేనన్నారు. షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుందని.. 2024 లో ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల ను చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు వారసత్వం రావడం కాదు..ఆయన ఆశయాలను కొనసాగించే వాళ్ళే నిజమైన వారసులని ప్రకటించారు. YSR పేరుతో వ్యాపారం చేసే వాళ్ళు వారసుడు కాదని జగన్ పై సెటైర్లు వేశారు. YSR ఆశయాలను కొనసాగించడం కోసమే షర్మిల భాద్యతలు తీసుకున్నారని ప్రకటించారు. ఏపిలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు మేము అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఉపఎన్నికల ప్రస్తావన తీసుకు రావడంతో రాజకీయం మారిపోయింది. షర్మిల చప్పట్లు కొట్టి తన సంతోషాన్ని తెలిపారు. అంటే.. జగన్ ఎంపీగా వెళ్లేందుకు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. ఉపఎన్నికలకు వెళ్తే.. షర్మిల మరోసారి పోటీ చేయడమే కాదు.. రేవంత్ రెడ్డి వైపు నుంచి పూర్తి స్థాయి సపోర్టు లభించే అవకాశం ఉంది. ఈ పరిణామంతో జగన్ కు ఉపఎన్నికల లాంటి ఆలోచన ఉంటే వెనక్కి తగ్గే అవకాశం ఉంది.