నకిలీ కంపెనీలు సృష్టించి, బలవంతంగా పనులు చేయిస్తూ అమెరికా పోలీసులకు చిక్కారు నలుగురు తెలుగు వాళ్లు. దాదాపు 100మందితో పనిచేస్తున్నారని వెల్లడి కావటంతో వారెంట్ ఇష్యూ జారీ చేశారు.
గిన్స్ బర్గ్ లోని ఓ అపార్ట్మెంట్ లో ఎక్కువ మంది పనిచేస్తున్నారని ఫిర్యాదు అందటంతో పోలీసులు సోదాలు జరిపారు. ఈ సోదాల సమయంలో 15మంది యువతులు అక్కడే పనిచేస్తున్నారు. వారితోనూ బలవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారి నుండి ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, ప్రింటర్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత ఇతర నగరాల్లోనూ ఇలాగే అక్రమంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారి దగ్గర నుండి తీసుకున్న ల్యాప్ టాప్ ల నుండి డేటా విశ్లేషించి… నకిలీ కంపెనీలని తేల్చారు. ఈ కేసులో సంతోష్, ద్వారక, అనిల్ మాల్, చందన్ అనే నలుగురిపై ఇప్పటికే వారెంట్ జారీ అయ్యింది.
డల్లాస్ కేంద్రంగా ఇదంతా జరుగుతోందని… ఓ భారత ఏజెన్సీలోని నలుగురు తమతో బలవంతంగా పని చేయిస్తున్నారని పట్టుబడ్డ నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.