తెలుగు మీడియాపై బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. దీనికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత వార్తలు ప్రసారం చేయకపోవడమే. ఇటీవల గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి ఒక్క పోస్టుకు వంద మందిని మెయిన్స్ కు ఎంపిక చేయాలని ఉద్యమం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక్క పోస్టుకు యాభై మందినే మెయిన్స్ కు ఎంపిక చేస్తూ ఫలితాలు ప్రకటించింది. దీన్ని నిరసిస్తూ నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నారు.
అయితే ఈ నిరసలన్న సోషల్ మీడియాలో.. బీఆర్ఎస్ ప్రాపగాండా పేజీల్లోనే కనిపిస్తున్నాయి. ప్రధాన మీడియాలో కానీ.. డిజిటల్ మీడియాలో కానీ ఎక్కడా కనిపించడం లేదు. నిజంగా నిరుద్యోగులు చేసే ఆందోళన అయితే ప్రధాన మీడియాలో వచ్చేది.కానీ ఎక్కువగా ఆర్గనైజ్డ్ నిరసనలే జరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఏదో చేయాలన్నట్లుగా చేస్తున్నారు. దీంతో ప్రధాన మీడియా కానీ ఇతర మీడియా కానీ పట్టించుకోవడం లేదు. పూర్తిగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆ నిరసనల ఈవెంట్స్ పరిమితమయ్యాయి.
అందుకే బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మీడియా పూర్తిగా అధికార పార్టీ చేతిలో బందీగా మారిపోయిందని ప్రజల వాయిస్ వినిపించడం లేదని అంటోంది. ఈ విషయంపై ప్రధాన మీడియాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేకంగా వీడియోలు కూడా చేస్తున్నారు. కానీ మీడియాను గతంలో ఎలా కంట్రోల్ చేయాలో బీఆర్ఎస్ సర్కార్ చూపించింది. వ్యాపారవేత్తల చేతుల్లో ఉన్న మీడియాను అదే విధంగా రేవంత్ కంట్రోల్ చేస్తున్నారని అనుకోవచ్చు. దానికి బీఆర్ఎస్దే బాధ్యత అవుతుదంది. వ్యవస్థల్ని చెరబడితే ఇలాగే ఉంటుంది మరి.