ఈ ఆంధ్రా సీఎంలు మా తెలంగాణ భూములు అమ్మేస్తున్నారని, ఆంధ్రాకు దోచిపెడుతున్నారని ఉద్యమ సమయంలో ధర్నాలు చేసింది ఆనాటి టీఆర్ఎస్సే. భూముల అమ్మవద్దని ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేసింది ఇదే కేటీఆర్.
కట్ చేస్తే… కేసీఆర్ సర్కార్ హాయంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో భూముల అమ్మకం కొనసాగింది. హెచ్ఎండీఏను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీగా తయారు చేసింది కేసీఆర్ సర్కార్. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నది కూడా కేటీఆరే.
తాజాగా… నిధుల సమీకరణ కోసం రేవంత్ సర్కార్ భూములు తనాఖా పెట్టాలనుకుంటుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా సహా పలు కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ చేస్తుంది. తనాఖా పెట్టడం అంటే ఆ భూములపై లోన్ తెచ్చుకోవటం. అమ్మటం కాదు… కానీ, అలా ఎలా పెడతారు, పరిశ్రమలకు ఏ భూములు ఇస్తారు అంటూ కేటీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలు చేయటం చర్చనీయాంశంగా మారింది.
మీరేం చేశారో… తెలియకుండానే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా? సమైక్యాంధ్ర పాలకులు అయినా తెలంగాణ వాదులు తిరగబడతారని భూముల అమ్మకం విషయంలో ఆలోచించారు, మీరు అంతకన్నా ఘోరంగా అమ్మకానికి తెగబడ్డారు… రాష్ట్రాన్ని అప్పు తెచ్చుకోలేని ఊబిలో దించారు… తాము ఆ అప్పులకు అసలు, వడ్డీ కడుతూ తనాఖా పెడితే విమర్శించేందుకు మీకు నోరు ఎలా వస్తుందని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ను ఓ మాట అనే ముందు మొన్నటి వరకు సర్కార్ నడిపిన మీరు ఏం చేశారో ఆలోచించుకోవాలని కౌంటర్ ఇస్తున్నారు.