అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారన్న వార్తలు ఎక్కువగా చదువుతూ ఉంటాం. ఇక్కడ ఆపరేషన్ల లాంటి గోలేం లేకుండా… అమ్మాయి అబ్బాయిగా మారిపోయింది. అంతా అధికారికంగా జరిగిపోయింది. ఇలా మార్చుకున్న వారు సాదాసీదా వ్యక్తి కాదు సివిల్ సర్వీస్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి కావడమే హైలెట్ అవుతోంది.
హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చీఫ్ కమిషనర్ ఆఫీస్‌లో పని చేస్తున్నారు 35 ఏళ్ల ఎం అనుసూయ. ఆమె మహిళ. ఆమె తాను మహిళను కానని.. పురుషునిగా మారిపోతానని దరఖాస్తు చేసుకున్నారు. భారత ప్రభుత్వం కూడా అంగీకారం తెలపడంతో తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా మార్చుకున్నారు. ఇకపై అమ్మాయిని కాదని అబ్బాయినంటూ ప్రకటించారు. అధికారిక ఉత్తర్వులు ప్రకారం “అనుసూయ అభ్యర్థన పరిగణనలోకి తీసుకున్నాం. ఇక నుంచి అన్ని అధికారిక రికార్డుల్లో అనుకతిర్ సూర్య’గా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగంలో చేరారు. అక్కడే 2018లో డిప్యూటీ కమిషనర్‌గా ప్రమోషన్ వచ్చింది. తర్వాత 2023లో హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. సూర్య చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి గతేడాది సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా డిగ్రీ పొందారు. ఓ అధికారి ఇలా తన జెండర్‌ను మార్చుకోవడం భారత సివిల్ సర్వీసెస్‌లో ఇదే తొలిసారి.