ఇడుపులపాయ ఐఐఐటీలో గంజాయి కలకలంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
ట్రిపుల్ ఐటీలో గంజాయి బారిన పడి విద్యార్థులు నష్టపోతున్నారంటూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళారు. క్యాంపస్ గంజాయికి అడ్డాగా మారుతోందని..గంజాయి కట్టడికి చర్యలు చేపట్టాలని లోకేష్ ను కోరగా.. విద్యాలయాల్లో మత్తు పదార్థాల ఆనవాళ్ళు లేకుండా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అసలు ఎవరు క్యాంపస్ లోకి గంజాయి రవాణా చేస్తున్నారు…? అనే విషయాలను గుర్తించి చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నిర్మూలనకు చర్యలు ప్రారంభించామని.. విద్యాలయాల్లో అలాంటి ఆనవాళ్ళే లేకుండా కఠిన చర్యలు చేపడుతామన్నారు. క్యాంపస్ ను కలుషిత వాతావరణం నుంచి కాపాడి..విద్యా వ్యవస్థను గాడిన పెడుతామని విద్యార్థుల తల్లిదండ్రులకు లోకేష్ హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ ను కాపాడుతామని ఆందోళన చెందవద్దని తెలిపారు.