గోవా ఎన్నికలకు ఎమ్మెల్సీ కవిత భారీగా ఫండింగ్ చేశారు… ఇది ఎవరో అన్న మాట కాదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ చేస్తున్న ఈడీ చేసిన ఆరోపణ. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ చార్జ్ షీట్ లో సంచలన విషయాలను పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారని… ఎమ్మెల్సీ కవిత తన పీఏ అశోక్ ద్వారా కోట్ల రూపాయలను పంపించారని, ఆ డబ్బును ఆప్ గోవా ఎన్నికల్లో వాడుకుందని ఈడీ ఆరోపించింది. ఇందుకు ఆధారంగా కేజ్రీవాల్-వినోద్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను రిట్రీవ్ చేసినట్లు కోర్టుకు తెలిపింది.
మీడియా సంస్థలో ఉన్న ముత్త గౌతమ్ ద్వారా అభిషేక్ బోయినపల్లి, హవాలా ద్వారా డబ్బు తరలించినట్లు ఈడీ పేర్కొంది. కవిత ద్వారా రెండు బైకులు, డబ్బు తీసుకెళ్లి వినోద్ చౌహన్ వద్ద దినేష్ అరోరాకు అప్పగించారని ఈడీ ఆరోపించింది.
ఢిల్లీలో అశోక్, దినేష్ అరోరాలు కలుసుకున్నారని… ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తం 100కోట్లు చేతులు మారాయని… అవన్నీ గోవా ఎన్నికల్లో ఆప్ వాడుకుందని ఈడీ కోర్టుకు తెలిపింది.