షల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును బెంగుళూరులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రీ-కూతురు ఉన్న వీడియోను చర్చకు పెట్టి, అసభ్యకరంగా మాట్లాడిన ప్రణీత్ పై చర్యలు తీసుకోవాల్సిన ముక్తకంఠంతో సినీ, రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేశారు.
బెంగుళూరులో ప్రణీత్ హనుమంతును జడ్జి ముందు ప్రవేశపెట్టి… ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు.
కేసులు నమోదైన వెంటనే ప్రణీత్ హనుమంతు… బెంగుళూరు నుండి విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్ తో పాటు ఉన్న మరో ముగ్గురిపై కూడా చర్యలుంటాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.