ఆంధ్రప్రదేశ్ లో భూతాన్ని తరిమికొట్టడంతో మళ్లీ పెట్టుబడు రాడార్లోకి ఏపీ వచ్చింది. చంద్రబాబును పలువురు విదేశీ కంపెనీల బృందాలు కలుస్తున్నాయి. పెట్టుబడుల ప్రతిపాదనలతో వస్తున్నాయి. వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్ ఫాస్ట్ ఏపీలో ప్లాంట్ పెట్టేందుకు ఆసక్తితో ఉంది. ఆ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. భూమి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని .. పెట్టుబడుల ప్రతిపాదనలతో రావాలని చందర్బాబ ుకోరారు.
విన్ ఫాస్ట్… వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ సంస్థ . ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు, బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలని విన్ ఫాస్ట్ సంస్థ ఆసక్తిగా ఉంది. విన్ ఫాస్ట్ నిజానికి తమిళనాడులో ప్లాంట్ పెట్టాలనుకుంది. తుత్తుకూడిలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ తర్వాత నిర్మాణం ముందుకు సాగలేదు. ఈవీ వాహనాల తయారీలో ఎంతో పేరెన్నిక గన్న విన్ ఫాస్ట్ భారత్ మార్కెట్ పై చాలా కాలంగా కసరత్తు జరుపుతోంది .
ఆటోమోబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కు మంచి బ్రాండ్ నేమ్ ఉంది. కియా కంపెనీ ఉత్పత్తిని రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యేలా చేయడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఈ క్రమంలో విన్ ఫాస్ట్ తో కూడా చర్చలు ఫలప్రదంగా ముగిస్తే.. ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్ కూడా రూ. 60 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలో చంద్రబాబును కలిశారు. ఈ రెండింటిపై త్వరలో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
చంద్రబాబు 2014-19 మధ్య పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కంపెనీలు వచ్చాయి. చాలా కంపెనీలు వచ్చే దశలో జగన్ ప్రభుత్వం వచ్చింది. మొత్తం పరిశ్రమల్ని వెనక్కి పంపేశారు. ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ..తిరుపతిలో రిలయన్స్ సెజ్ ను కూడా వెనక్కి పంపేశారు. ఇప్పుడు మళ్లీ అప్పటి ప్రతిపాదనల్ని మెటీరియలైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భూతం ఉందని ఇంకా చాలా మంది భయపడుతున్నారు. కానీ భూస్థాపితం చేస్తామని చంద్రబాబు వారికి హామీ ఇస్తున్నారు . వచ్చే ఆరు నెలల కాలంలో మళ్లీ ఏపీ పెట్టుబడుల రేసులోకి వచ్చే అవకాశం ఉంది.