పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని, ఏపీలో గత వైసీపీ నాయకులు వీరప్పన్ వారసులంటూ మండిపడ్డారు. ఎర్రచందనం పేరుతో సంపదను దోచుకొని, రాజకీయాలను శాసించారన్నారు.
రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చేశారని… ఇప్పుడు నిత్యం స్వామి వారికి సేవ చేసే రాజ్యం వచ్చిందని బండి సంజయ్ అన్నారు. వీరప్పన్ వారసులను ఎట్టి పరిస్థితులను వదలబోమని… విచారణ చేపడతామని హెచ్చరించారు.
స్వామి వారి ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవటంతో పాటు భక్తులకు మంచి సదుపాయాలు కల్పిస్తామని… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ గతంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎన్నో పోరాటాలు చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు.