మినీ పోర్న్ ఫిల్మ్లాంటి గుంటూరు టాకీస్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రవీణ్ సత్తారు. జాతీయ అవార్డు సాధించిన ఓ దర్శకుడు తన తదుపరి ప్రయత్నంతోనే ఇలాంటి సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. బూతు డైలాగులు, ఏ సర్టిఫికెట్‌కి మించిన సీన్లు, బోల్డ్ అనే పేరుతో ఓవర్ ఎక్స్పోజింగూ చేయించి… చిరాకెత్తించాడు. అయితే ప్రవీణ్ తీసిన గత సినిమాలకంటే, గుంటూరు టాకీస్కే నాలుగు టికెట్లు ఎక్కువ తెగాయి. బూతు మహత్తు అంతేనేమో?! అన్నట్టు ప్రవీణ్ సినిమా.. తాజాగా ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమా వికలాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న సైదులు అనే విద్యార్థి పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ పిర్యాదుని పోలీసులు కూడా స్వీకరించారు. ఇదే విషయంపై ప్రవీణ్ సత్తారుని సంప్రదిస్తే… ”ఈ కేసు విషయంపై నాకెలాంటి సమాచారం లేదు” అంటూ సమాధానం దాటేస్తున్నాడు. వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందిగా… ఈవాళో, రేపో… సమాధానం చెప్పక తప్పతుందా?