వావి వరసలు మరిచిపోయి తండ్రీ కూతుళ్ల బంధంపై అనుచితంగా కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ కు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది.
బెంగళూరు నుంచి పీటీ వారెంట్ పై ప్రణీత్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు..ఈ కేసులో మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా చేర్చిన ప్రణీత్ పై 67 బీ ఐటీ, ఫోక్సో , 79,29బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏ2 గా డల్లాస్ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్, ఏ 4గా సాయి ఆదినారాయణను చేర్చారు.
ప్రణీత్ వ్యవహారాన్ని ఇటీవల టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రణీత్ ను బెంగళూరు నుంచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
సభ్య సమాజం తలదించుకునేలా తండ్రి, కూతురు బంధాన్ని అవమానించేలా మాట్లాడిన ప్రణీత్ కు 14రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.