1974… ఆగస్టు 30
తాతమ్మ కల విడుదలైన తేదీ. నందమూరి తారక రామారావు నటించిన ఈ చిత్రం ద్వారానే బాలనటుడిగా నందమూరి బాలకృష్ణ వెండి తెరకు పరిచయం అయ్యారు. అంటే.. ఈ ఆగస్టుతో బాలయ్య నట జీవితానికి 50 ఏళ్లు పూర్తవుతాయన్నమాట. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు చలన చిత్రసీమ బాలయ్యను ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకొంది. ఈయేడాది సెప్టెంబరు 1న… హైదరాబాద్లో ఓ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో బాలయ్యతో పని చేసిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలూ అందరూ పాలు పంచుకోనున్నారని తెలుస్తోంది. అంతే కాదు, బాలీవుడ్ నుంచి కొంతమంది సెలబ్రెటీలు కూడా హాజరవుతారని సమాచారం.
ఇదే వేడుక ద్వారా బాలయ్య తన వారసుడు మోక్షజ్ఞను చిత్రసీమకు పరిచయం చేస్తారని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇదే వేదికపై బాలకృష్ణ క్లారిటీ ఇవ్వబోతున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం విశాఖపట్నంలో నటనకు సంబంధించిన తర్ఫీదు పొందుతున్నాడు మోక్షజ్ఞ. ఈ యేడాదే తన ఎంట్రీ ఉండొచ్చు.