విశాఖలో బజాన్ ఫైనాన్స్ ఫిన్ టెక్ హబ్ ను పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖ నుంచి సీఐఐ సమ్మిట్ లో వర్చువల్ గా పాల్గొన్న చంద్రబాబునాయుడతో పారిశ్రామికవేత్తలు రకరకాల ప్రతిపాదనలు ఉంచారు. చంద్రబాబు గురించి అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు అడగక ముందే కొంత మంది తమ పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆయన ముందు ఉంచారు. అందులో బజాజ్ ఫైనాన్స్ ఫిన్ టెక్ హబ్ ఒకటి.
బజాజ్ ఫైనాన్స్ దేశంలోని అతి పెద్ద ఫిన్ సర్వ్ కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ రెండున్నర ట్రిలియన్ల రూపాయలు. దేశవ్యాప్తంగా సేవలు అందించే బజాజ్ ఫైనాన్స్.. ఫిన్ టెక్ హబ్ ను పెట్టాలనుకుంటోంది. దానికి విశాఖ అనువైన ప్రాంతంగా భావించింది. చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ హయాంలో ఫిన్ టెక్ , బ్లాక్ చెయిన్ వంటి రంగాల్లో విశాఖను ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపించాయి. కానీ వైసీపీ ప్రభుత్వ తీరుతో వెనక్కి పోయాయి.
ఇప్పుడు మళ్లీ ఫిన్ టెక్, సాఫ్ట్ వేర్ పరిశ్రమల్ని విశాఖకు ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామక వర్గాలతో మంచి పరిచయం ఉన్న టీజీ భరత్ ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. విశాఖకు రాబోయే రోజుల్లో పరిశ్రమలు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి.