వైసీపీ అధినేత జగన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి సీఐడీ కస్టడీలో తనపై దాడి చేయడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసునమోదు అయింది. మాజీ సీఎం జగన్ తో పాటు అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయలు, విజయ్ పాల్ లపై కూడా కేసు నమోదు అయింది. రఘురామకు చెందిన మెడికల్ రికార్డులు ట్యాంపర్ చేసిన గుంటూరుజీజీహెచ్ సూపరింటెండెంట్ పద్మావతిపైనా కేసు నమోదు చేశారు.
కేసు నమోదు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్ పదో తేదీన రఘురామ గుంటూరు ఎస్పీకి లేఖ రాశారు. రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదువుతుందని ఆయన అప్పుడే చెప్పారు.కాస్త ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు అయింది. 2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజు పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారు. ఏ కేసు పెట్టారో.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేదు. వెంటనే గుంటూరుకు తరలించారు. తర్వాత సీఐడీ అధికారులు సుమోటో రాజద్రోహం కేసులు పెట్టినట్లుగా ప్రకటించారు. ఆ రాత్రికి ఆయనపై హత్యాయత్నం చేశారు. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరి ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షల వరకూ వెళ్లింి.
. ఆ తర్వాత తనపై జరిగిన దాడి విషయంలో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. తనను అరెస్టు చేసిన అధికారుల కాల్ రికార్డులను భద్ర పరిచేలా.. ఆదేశాలు తెచ్చుకున్నారు. . జగన్ మోహన్ రెడ్డి, అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఐపీఎస్ సీతామాంజనేయులు, ఇతర అధికారులపై అప్పట్లో జరిగిన ఘటనలతో పాటు వాటికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఫిర్యాదుకు జత చేశారు. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది.