రఘురామ ఫిర్యాదుతో జగన్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదయింది. ఇది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు మీడియా సమావేశం పెట్టారు. ఇందు కోసం తన టేబుల్ నిండా పేపర్లు పెట్టుకున్నారు. ఇంకా ఎక్స్ ట్రా అందించడానికి మరో వ్యక్తిని ఎదురు నిలబెట్టారు. ఇంతా చేసి ఆయన ఏం ప్రశ్నించారంటే.. పదకొండో తేదీన రఘురామ ఫిర్యాదు చేస్తే పదో తేదీనే లీగల్ ఒపీనియన్ తీసుకున్నారని .. కుట్రకు ఇదే సాక్ష్యం అని వాదించేశారు. రఘురామ పదో తేదీన ఫిర్యాదు చేశారని మీడియాలో కూడా వచ్చింది. ఇదే పెద్ద అసంబద్దమన వాదన అనుకుంటే.. రఘురామను కొట్టారని ఆయన ఒప్పుకున్నారు.
తనను కస్టడీలో ముసుగులు ధరించిన వ్యక్తులు కొట్టారని అప్పట్లో రఘురామ జడ్జికి చెప్పారని కానీ జగన్ పేరు చెప్పలేదన్నారు. కానీ ఇప్పుడెలా చెప్పారని లాయర్ లాజిక్ తో ప్రశ్నించారు. ఎవరు కొట్టారన్నది తర్వాత విషయం కొట్టారు అన్నది నిజం. సీఐడీ కస్టడీలో ఉంటే ఎవరు కొడతారు ? ఎవరు వస్తారు ? అన్నది ఊహించాల్సిన పని లేదు. ఆస్పత్రిలో గాయాలేమీ లేవని రిపోర్టు వచ్చిందని పొన్నవోలు వాదించారు. కానీ ఆర్మీ ఆస్పత్రి రికార్డు గురించి చెప్పలేదు.
చివరిగా పొన్నోవోలు ఇలాంటి కేసులు పెట్టుకుంటూ పోతే అధికారులు పని చేయలేరని.. వ్యవస్థలు నాశనమైపోతాయని ఆవేదన చెందారు. అంతేనా ఓ జర్మనీ పిట్టకథ కూడా చెప్పారు. ఇప్పుడు తన దాకా రాలేదని ప్రశ్నించకపోతే రేపు మీదాకా వస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ఆయన.. చంద్రబాబు కేసుల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టిన వ్యవహారం.. ఏదీ ఏఏజీ హోదాలో … నేరం. అది ఆయనదాకా వచ్చినప్పుడు.. ఇంకెంత వాదిస్తారో. కొసమెరుపేమిటంటే.. 72 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందట.. ఇప్పుడెలా చెల్లుతుందని పొన్నవోలు వాదన. అసలు కోర్టులో వాదించాల్సినదంతా మీడియా ముందు వాదించేశారు. కానీ ఎవరికీ ఒక్క ముక్క అర్థం కాదు.