పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్దిని మరోసారి చాటుకున్నారు. ఇల్లు కావాలని ఓ నిరుపేద కుటుంబం కోరడంతో అందుకు అంగీకరించిన చంద్రబాబు.. పన్నెండు రోజుల్లోనే హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో పేదల మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిరూపించారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పంపిణీలో భాగంగా జులై ఒకటో తేదీన పెనుమాకలోని పాముల నాయక్ ఇంటికి వెళ్ళారు చంద్రబాబు. పెన్షన్ పంపిణీ చేసి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము పూరిగుడిసెలో ఉంటున్నామని..తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని, మీరే సాయం చేయాలని కోరడంతో చంద్రబాబు అంగీకరించారు.
పాముల నాయక్ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన పత్రాలు కూడా అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 1. 80 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఇంటి నిర్మాణం కోసం పాముల నాయక్ దంపతులు భూమిపూజ చేశారు.
మంత్రి లోకేష్ చొరవతో టీడీపీ నాయకులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ కల సాకారం అవుతుందని.. చంద్రబాబు, లోకేష్ కు పాముల నాయక్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.