ఐపీఎస్ అధికారికి రాజ్యాంగం, చట్టాలే కాదు.. సర్వీస్ రూల్స్ కూడా తెలియవని మరోసారి నిరూపితమయింది. ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పినట్లు చేస్తామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. కులం కార్డు వాడేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పులకు వక్రభాష్యం చెబుతున్నారు. ఆయనే ఐపీఎస్ .. డీజీ ర్యాంక్‌లో ఉన్న పీవీ సునీల్ కుమార్. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ?
జగన్ కోసం మానవ హక్కుల్ని కాలరాసిన పీవీ సునీల్
జగన్ రెడ్డి మానసిక స్థితి ప్రకారం.. తనకు అధికారం వచ్చింది ప్రత్యర్థులపై కసి తీర్చుకోవడానికే. అందుకే సీఐడీని ప్రత్యేక ఆయుధంగా చేసుకున్నారు. మీ పిచ్చికి నేను ఆయుధాన్నవుతానని పీవీ సునీల్ రెడీ అయిపోయారు. సీఐడీ చీఫ్ గా ఆయన చేయని అరాచకం లేదు. చిన్న సాక్ష్యం ఉండదు.. ఎఫ్ఐఆర్ ఉండదు.. రాత్రికి రాత్రి అచ్చెన్నాయుడు లాంటి వారిని కూడా గోడలు దూకి అరెస్టులు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్లు బయటపెడతారు. ఓ ఐపీఎస్ ఇంత ఘోరంగా రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించిన ఐపీఎస్ మరొకరు ఉండరేమో. ఏం చేసినా చెల్లుతుందని ఇతర ఐపీఎస్‌లలో ధైర్యం నింపింది సునీల్ కుమార్ తీరే .
కొట్టమన్నవాళ్లని కొట్టడమే పని !
సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేయడం కాదు.. అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడం… రాత్రంతా హింసించడం అనేది పివీ సునీల్ తోనే సాధ్యం. అలా కొట్టేది ఎంపీనా.. మరో వీఐపీనా అన్నది కాదు. హింసించి ..దాన్ని వీడియో కాల్స్ లో చూపించడమే ఆయన చేసిన పని. ఇప్పుడు ఆయన సుద్ధపూస కబుర్లు చెబుతూ.. తెర ముందుకు వస్తున్నారు. కులం కార్డు వాడేస్తున్నారు. ఇప్పటి వరకూ దళితులకు ఎంత వరకు అండగా ఉన్నారో ?
మత సంస్థ నడిపే .. హిందూ వ్యతిరేక కామెంట్లు చేసే ఐపీఎస్ అధికారి !
ఐపీఎస్ అధికారి అయి ఉండి.. ఆయన మత మార్పిళ్ల సంస్థను నడుపుతున్నారు. దానికి అంబేద్కర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ సంస్థ తరపున సభలు పెట్టి హిందువులపై విషం వెళ్లగక్కుతూంటారు. ఆయన వీడియోలను కేంద్రానికి పంపి ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకోవాలని కేంద్రం లేఖ రాసింది. అప్పట్లోనే ఆయనపై ఖచ్చితమైన చర్యలు తీసుకుని తమకు సమాచారం ఇవ్వాలని కేంద్రం పదే పదే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. కానీ బదిలీ చేసి ఊరుకుననారు. అఖిల భారత సర్వీసు అధికారి అయి ఉండి నిబంధనలకు విరుద్ధంగా ఓ మతానికి అనుకూలంగా ప్రచారం చేయడమేకాదు.. భార్యపై వరకట్న వేధింపుల కేసు కూడా ఆయనపై ఉంది. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వైసీపీలో చేరి పోటీ చేయాలనుకున్నా.. టిక్కెట్ దక్కలేదు. ఇప్పుడు కేసుల పాలవుతూండటంతో… ఆయనకు దళిత వాదం గుర్తుకు వస్తోంది. పైగా ప్రభుత్వంలో ఎవరు ఉంటే వారు చెప్పినట్లు చేస్తామని కొత్త రాగం అందుకుంటున్నారు. కొట్టమంటే కొట్టి.. చంపమంటే చంపేస్తారా ?
మరొకరు గీత దాటనంత కఠిన చర్యలు ఉండాలి !
ఐపీఎస్ అధికారులకు ప్రజాధనం జీతంగా చెల్లిస్తారు. వ్యవస్థల్ని చేతిలో పెడతారు. అలాంటి వారు ఎంత బాధ్యతగా ఉండాలి ?. వారు దారి తప్పితే… ఒక్క రాజకీయ నాయకుడికో.. లాభమో నష్టమో కాదు.. మొత్తం సమాజానికి నష్టం ఉంటుంది. ఇాలాంటి వారిని ఎలా శిక్షిచాలంటే.. మరో అధికారి గీత దాటడానికి కూడా భయపడాలి. వీరిని ఇలా వదిలేస్తే ఏం చేసి అయినా తప్పించుకోవచ్చని అనుకుంటారు.