న్యూయార్క్ లో టైమ్స్ స్క్వేర్ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి. ప్రపంచంలో ఎవరైనా అక్కడ బిల్ బోర్డుపై ప్రకటనలు వేయించుకుని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సినిమా, వ్యాపారం, రాజకీయం ఏదైనా సరే అక్కడి ప్రకటనలకు అంత పాపులారిటీ వచ్చింది. ఆ ప్రాంతం కూడా ఉల్లాసంగా గడపడానికి అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దారు. అలాంటిదే.. హైదరాబాద్‌లోనూ ప్లాన్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం.
హైదరాబాద్‌లో ఐటీ కారిడార్ విదేశీ నగరం మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎత్తైన అద్దాల భవనాలు… ఐటీ కంపెనీలతో పాటు టీ హబ్, నాలెడ్జ్ హబ్, గేమింగ్ హబ్ వంటివి ఉన్న చోట… టీ స్క్వేర్ ఏర్పాటు చేయాలని ప్రభఉత్వం నిర్ణయించింది. టెండర్లు ఆహ్వానించింది. టీజీఐఐసీ ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని నిర్మించాలని డిసైడయింది. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా.. ఐటీ కారిడార్‌లో ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలని ్ుకుంటున్నారు.
ఈ కేంద్రం నిర్మాణంలో భారీగా ఆదాయం కూడా వస్తుంది. ప్రముఖుల పుట్టినరోజుల వేడుకలు, సినిమాల అప్డేట్లు, అవార్డులు, చారిత్రక విశేషాల వంటివాటిని ఇక్కడ బిల్ బోర్డుల మీద ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆగస్టులో టెండర్లు ఖరారు చేసి వెంటనే నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉంది.