ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు. అందుకే ఈ టైటిల్ పెడితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతానికి ఇదే ఈ సినిమా వర్కింగ్ టైటిల్. దీనికంటే మంచి టైటిల్ తడితే… దాన్ని ఫిక్స్ చేస్తారు. లేదంటే ‘ఫౌజీ’నే ఉంటుంది.
1947 కంటే ముందు సాగే కథ ఇది. ప్రభాస్ బ్రిటీష్ సైన్యంలో ఓ సోల్జర్‌గా కనిపించనున్నాడు. యుద్ధ నేపథ్యం ఉన్నా – హను స్టైల్ లో సాగే అందమైన ప్రేమకథ కూడా ఇందులో మేళవించబోతున్నారని టాక్. కథానాయికగా చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ పేరు దాదాపుగా ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని బాణీలు సిద్థం చేసినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.