మొన్న అయోధ్యలో బీజేపీ ఓటమి ఆ పార్టీని ఎంత అభాసుపాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాముడికి గుడి కట్టిన తర్వాత ఏడాది కూడా కాకముందే ఎన్నికలొస్తే ఏకపక్షంగా గెలవాల్సిన బీజేపీ అభ్యర్థి, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ విషయాన్ని ఏ చిన్న అవకాశం ఉన్నా ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ విరుచుకుపడుతున్నారు.
ఆ అయోధ్య ఓటమి మరవక ముందే…. దేవభూమిగా కీర్తించే బద్రీనాథ్ స్థానంలో బీజేపీ ఓటమి పాలయ్యింది. దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో… ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ రిజల్ట్ కూడా వచ్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజేందర్ సింగ్ బండారిపై కాంగ్రెస్ నేత లకాపత్ సింగ్ 5వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేందర్ సింగ్ బండారియే అక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరగా… ఆ సీటు ఖాళీ అయ్యింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగ్గా… ఆయనే బీజేపీ నుండి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. దీంతో కాంగ్రెస్ ఆ సీటును కాపాడుకున్నట్లు అయ్యింది.
అయితే, మొన్న అయోధ్య, ఇప్పుడు బద్రీనాథ్ లో ఓటమిపై కమళనాథులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.