విజయసాయిరెడ్డిపై చాలా ఆరోపణలు ఉన్నాయి కానీ.. ఇప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలు మాత్రం గతంలో రాలేదు. తన భార్యకు పుట్టిన పిల్లవాడికి తాను కారణం కాదని విజయసాయిరెడ్డే కారణం కావొచ్చని ఓ అధికారిణి భర్త .. దేవాదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాయడం .. అది ఇప్పుడు బయటకు రావడం సంచలనంగా మారింది.
వైసీపీ హయాంలో ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా వ్యవహరించిన శాంతి అనే అధికారిణిపై చాలా వివాదాలు ఉన్నాయి. వైసీపీ పెద్దలకు నమ్మకంగా ఉంటూ వారు చెప్పిన పని చేస్తూ.. అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డినే పట్టుబట్టి ఆమెకు అక్కడ పోస్టింగ్ ఇప్పించారని చెబుతారు. విజయసాయిరెడ్డి ట్వీట్ల కింద ఆమె గతంలో అనేక కామెంట్లు చేశారు. ఆయనను పొగుడుతూ శాంతి పెట్టిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కొత్త ప్రభుత్వం రాగానే ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు సస్పెన్షన్ లోనే ఉన్నారు. అదంతా అధికారికం. కానీ హఠాత్తుగా ఆమె భర్త భర్త మదన్ మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్‌లే కారణమని మదన్ మోహన్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై విజయసాయిరెడ్డి ఇంకా స్పందించలేదు. లేటు వయసులో ఇలా ఓ ఆరోపణలను ఓ అధికారి భర్త నుంచి ఎదుర్కోవాల్సి రావడం.. కాస్త ఇబ్బందికరమే. మదన్ మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. విషయం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఆయన ఉన్నతాధికారులకు చేసిన పిర్యాదు దగ్గరే ఉన్నారు.