దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతి విషయంలో ఆమె భర్త సంచలన విషయాలను మీడియా ముందు వెల్లడించారు. తాను విజయసాయిరెడ్డికి బిడ్డను కనిపెట్టానని స్వయంగా చెప్పిందని శాంతి భర్త మదన్ మోహన్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్మీట్ పెట్టి చెప్పారు. శాంతితో తనకు విడాకులు అయ్యాయన్నది అబద్దమన్నారు.
2019లో దేవాదాయశాఖ నోటిఫికేషన్ ద్వారా శాంతికి ఉద్యోగం వచ్చిందని … వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి పరిచమయ్యారని మదన్ మోహన్ తెలిపారు. తనకు కూడా విజయసాయిరెడ్డిని పరిచయంచేసిందని.. తాము ఇద్దరం కలిసి జూబ్లీహిల్స్ లోని విజయసాయిరెడ్డి ఇంటికి కూడా వెళ్లామన్నారు. విజయసాయిరెడ్డికి తన తండ్రి వయసు ఉండటంతో అనుమానం రాలేదని మదన్ మోహన్ చెప్పారు. విజయవాడలో విల్లా కొనడానికి నాలుగున్నర కోట్లు విజయసాయిరెడ్డి ఇస్తారని శాంతి చెప్పిందన్నారు. కోటి అరవై లక్షల రూపాయల నగదును పంపాడని ఆ ఫోటోలను కూడా మదన్ మోహన్ ప్రదర్శించారు.
బిడ్డ ఎవరికి పుట్టారో తేల్చాలని మదన్ మోహన్ కోరారు. సుభాష్ తో బిడ్డను కన్నానని శాంతి చెప్పింది అబద్దమన్నారు. తనకు ఇంతకు ముందే పెళ్లయిందని తాను అలాంటి వాటికి దూరమని సుభాష్ చెప్పారని మదన్ మోహన్ వివరించారు. తాను డీఎన్ఏ టెస్టుకు కూడా సిద్దమని సుభాష తనకు చెప్పాడన్నారు. బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలన్నారు. గత ఏడు నెలలుగా నేను పడుతున్న మానసి వేదనను ప్రజలకు తెలియచెప్పాలనే మీడియా ముందుకు వచ్చానన్నారు.