ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తనకు విజయసాయిరెడ్డితో ఎలాంటి సంబంధం లేదని శాంతి చెప్తుండగా.. శారీరక సంబంధం ఉందని ఆమె మొదటి భర్త చేసిన ఆరోపణలను విజయసాయిరెడ్డి ఖండించారు. ఇంతటితో ఈ ఇష్యూకు ముగింపు లభిస్తుందని అనుకున్నా మదన్ హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి..విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాలని, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయనడంతో ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకున్నట్లు అయింది.
తాను విదేశాల్లో ఉండగానే తన భార్య గర్భం దాల్చిందని, అందుకు విజయసాయిరెడ్డి కారణమని మదన్ సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డే వల్లే శాంతి తల్లి అయినట్లుగా స్వయంగా ఆమే తనకు చెప్పిందని మదన్ తెలిపారు. ఆ బిడ్డ ఎవరి సంతానం అని తెలిసే వరకు పోరాటం ఆపనని స్పష్టం చేశారు.తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మదన్ చెప్తుండటంతో ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులను కూడా చవిచూస్తున్నారు. మదన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించినా.. డీఎన్ఏ టెస్ట్ కు సిద్దపడతారా..? లేక తనకేం సంబంధం లేదని లైట్ తీసుకుంటారా..? అని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. నిజనిజాలు తేలే వరకు తను పోరాటం ఆపనని మదన్ తేల్చి చెప్తుండటంతో సచ్చీలతను నిరూపించుకునేందుకు విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు సిద్దపడతారా చూడాలి.