అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాట్ ఫేవరేట్ గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ఎంపిక చేసుకున్నారు. 39 ఏళ్ల జేడీ వాన్స్ మంచి రచయిత. మాజీ సక్సెస్ ఫుల్ వెంచర్ క్యాపిటలిస్టు. రాజకీయంగా ఉన్నత భావాలతో ప్రజల్ని ఇట్టే ఆకట్టుకున్నారు. ఆయనను ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారు చేసుకోవడంతో.. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికికారణం జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వాన్స్.
ఇండియన్ హిందూ కుటుంబానికి చెందిన మహిళను వివాహం చేసుకున్న వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ట్రంప్… ఆసియా మూలాలున్న ఓటర్ల మద్దతును కూడా పొందుతారని అంచనా వేస్తున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఉషా చిలుకూరి యేల్ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడు జేడీ వాన్స్ పరిచయమయ్యారు. కాలేజీ ప్రాజెక్టుల్లో కలిసి పని చేశారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఉషా చిలుకూరి లో ప్రోఫైల్ ను ఇష్టపడతారు. భర్తకు రాజకీయ ప్రచారంలో సాయం చేసినా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. లిటిగేటర్ గా పని చేస్తే ఉషా చిలుకూరి గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద..ఇతర న్యాయమూర్తుల వద్ద కూడా పని చేశారు.
జేడీ వాన్స్ ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ట్రంప్, వాన్స్ జోడిపై మరింత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికై ట్రంప్ కు పోటీగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సరి కాదని ఆయన ఆరోగ్యం సరిగా లేదని అమెరికాను నడపలేరని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయినా అభ్యర్థిత్వాన్ని వదులుకునేందుకు బైడెన్ రెడీగా లేరు. కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ మరింత పాజిటివ్ వేలోకి వెళ్లారని అంటున్నారు. మొత్తంగా అమెరికా దేశ సెకండ్ ఉమన్ గా తెలుగు మహిళ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఉమన్ గా ట్రంప్ సతీమణి ఉంటారు.