విజయసాయిరెడ్డి ఎన్నడూ లేనంతగా కార్నర్ అయిపోయారు. ఆయన చుట్టూ ఓ భారీ గొయ్యి తవ్వేశారు. ఇప్పటికి ఆయన వచ్చిన సమస్యలు చాలా చిన్నవి. అసలైనవి ముందు ముందు రానున్నాయి. దీని వెనుక ఉన్నది ఎవరు ?. టీడీపీ నేతలు మాత్రం కాదు. ఆ విషయం విజయసాయిరెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. ఆయనను టార్గెట్ చేస్తోంది వైసీపీలోని నెంబర్ టూ నాయకుడేనని గట్టిగా నమ్ముతున్నారు. గతంలో ఇంటలిజెన్స్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని విజయసాయిరెడ్డి రహస్యాలను.. వ్యాపార వ్యవహారాలను.. ఇతర వ్యక్తిగత విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్న ఆ నేత ఇప్పుడు గేమ్ ప్రారంభించారని అంటున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. పాలన, ఎన్నికల వ్యూహాలను చూసుకున్న ఎవరిపైనా ఆయనకు నమ్మకం కుదరడంలేదు. గతంలో విజయసాయిరెడ్డి వైసీపీ విజయానికి చేసిన కృషి గురించి ఎక్కువ ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి చేతుల్లో ఉంటే విజయం దాటిపోయేది కాదన్న చర్చ జరుగుతోంది. జగన్ కూ అలాగే అనిపిస్తోందేమో కానీ… విజయసాయి చుట్టూ కందకాలు తవ్వడం ప్రారంభమయింది. అందులో భాగంగానే మదన్ మోహన్ లేఖ బయటకు వచ్చింది. దాన్ని నుంచి బయటపడేందుకు విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు మరింత రచ్చకు కారణం అయ్యాయి. ఇప్పుడు ఆయన తన సొంత ఇంటికి నిప్పు పెట్టుకున్నట్లే అయింది.
విజయసాయిరెడ్డి వ్యవహారం ఇంతటితో ఆగదు. ఇప్పుడు ఆయన మదన్ మోహన్ , శాంతి దంపతులకు ఇచ్చిన కోట్ల గురించి వెలుగులోకి వచ్చింది. కంటిన్యూషన్ గా మరిన్ని సంచలన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ మెటీరియల్ ఇప్పటికే వైసీపీలోని కీలక నేతలు రెడీ చేశారు. సమయాన్ని చూసి మరో వారంలో లీక్ చేసే అవకాశం ఉంది. దీని గురించి స్ఫష్టమైన సూచనలు ఉండటంతోనే… విజయసాయిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారు. సొంత పార్టీలో వాళ్లు ఉన్నా వదలనని అంటున్నారు. కానీ ఆయన చుట్టూ గోతులు తవ్వేశారని మాత్రం ఇంకా గుర్తించలేకపోతున్నారు.
విజయసాయిరెడ్డిని టీడీపీ ఇంకా టార్గెట్ చేయలేదు. ఆ మాటకొస్తే ఇంకా ఎవర్నీ టార్గెట్ చేయలేదు. ప్రస్తుతానికి బొక్కలు పెట్టిపోయిన ఖజానా గురించి.. దారిన పెట్టుకోవాల్సిన పాలన గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. టీడీపీ దృష్టి పెట్టే సమయానికి వస్తే.. విజయసాయిరెడ్డి మరింత ఇబ్బంది పడనున్నారు. కోడెలను విజయసాయిరెడ్డి పెట్టిన ఇబ్బందులు మొత్తం ఆయనకు రివర్స్ లో వచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి.