అన్ని వైపుల నుంచి వస్తున్న సవాళ్లతో విజయసాయిరెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంత రచ్చ చేసి.. ఇంత నోరు చేసుకున్న తర్వాత ఆయనను అందరూ ఒకే విషయంలో టార్గెట్ చేస్తున్నారు. అదే డీఎన్ఏ టెస్టు. ఆ అధికారిణి భర్త దగ్గర నుంచి విజయసాయిరెడ్డి దుర్భాషలాడిన మీడియా ప్రతినిధుల వరకూ అందరూ.. డీఎన్ఏ టెస్టుకు రెడీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి ఈ విషయంలో ఏదీ కలసి రావడం లేదు.
ఆ అధికారిణి భర్త తాను డీఎన్ఏ టెస్టుకు రెడీ అంటున్నారు. విజయసాయిరెడ్డి రావాలంటున్నారు. విజయసాయి బిడ్డ కాదని తేలితే.. కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతానని కూడా సవాల్ చేశారు. అదేసమయంలో లాయర్ సుభాష్ రెడ్డి కూడా తనకు సంబంధం లేదంటున్నారు. ఆయన మీడియా ముందుకు రాలేదు కానీ ఆయన మాట్లాడిన ఆడియో టేపులు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆ బిడ్డతో తనకు సంబంధం లేదని.. ఆమె ప్రసవించిన రోజు ఆస్పత్రికి రమ్మంటే వెళ్లానని సంతకం పెట్టానని అంతకు మించి తనకేమీ తెలియదంటున్నారు. తనకు వేరే పెళ్లి అయిందని ఆయన చెబుతున్నారు.
ఈ సస్పెన్స్ మధ్య అందరూ డీఎన్ఏ టెస్టుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ విషయం వారి అంతర్గత విషయం. ఆ అధికారిణి.. ఆమె భర్త.. విజయసాయిరెడ్డి , సుభాష్ రెడ్డి అనేవారు తేల్చుకోవాల్సింది. కానీ విజయసాయిరెడ్డి దీన్ని రాజకీయం చేయడంతో ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆయనపై ఎటాక్ జరుగుతోంది. తమపై విమర్శలు చేశావు కాబట్టి.. డీఎన్ఏ టెస్టుకు రావాలని సవాల్ చేస్తున్నారు. అందరూ ఒప్పుకుంటున్నా నువ్ ఎందుకు ఒప్పుకోవట్లేదో చెప్పాలంటున్నారు.
వీటికి తోడు.. ఆ అధికారిణికి ఇచ్చిన కోటి అరవై లక్షల నగదు వ్యవహారంలో ఎప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుందోనన్న టెన్షన్ కొత్తగా విజయసాయిరెడ్డికి ప్రారంభమయిందని చెబుతున్నారు.