మేఘా కంపెనీలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఓ ట్యాక్స్ హెవెన్ ద్వీపం నుంచి చేసిన బ్యాంక్ గ్యారంటీ స్కాముల గురించి రవి ప్రకాష్ బయట పెట్టడం పెను సంచలనం అయింది. ఈ అంశంపై మేఘా కంపెనీలు కానీ.. రవి ప్రకాష్ బయట పెట్టిన ఇతర కంపెనీలు కానీ కిక్కురుమనలేదు. కానీ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులమంటూ కొంత మంది చెలరేగిపోయే ప్రయత్నం చేశారు. వంద కోట్లకు పరువు నష్టం దావా వేశామంటూ వాట్సాప్ న్యూస్ సర్క్యూలేట్ చేస్తున్నారు.
నిజంగా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇలా కోర్టుకు ఎక్కితే మొదటగా బండారం బయటపడేది ఆ బ్యాంకుదే. ఎందుకు.. ఇక్కడి కంపెనీలకే బ్యాంకు గ్యారంటీలు ఇస్తున్నారన్న దగ్గర నుంచి ఆ బ్యాంక్ గ్యాంటీలకు తీసుకుంటున్న కమిషన్ వరకూ మొత్తం బయటపడతాయి. ఆ ఎగ్జిమ్ బ్యాంక్ వ్యవహారాల గురించి కార్పొరేట్ సర్కిల్స్ లో అందరికీ తెలుసు. మామూలుగా తాము తప్పు చేయకపోతే మేఘా కంపెనీ రంగంలోకి దిగి రవిప్రకాష్ కు నోటీసులు ఇచ్చి ఉండేది .కానీ దీనికి కూడా యూరో ఎగ్జిమ్ బ్యాంకును వాడుకున్నారంటే.. ఆ బ్యాంకు ఎంత బినామీనో అర్థం చేసుకోవచ్చన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
రవిప్రకాష్.. గతంలోనే ఇలాంటి సంచలన విషయాలు.. మేఘా తో పాటు మరికొతం మంది రియల్ ఎస్టేట్ టైకూర్ల అక్రమ వ్యాపారాలు, వ్యవహారాల గురించి బయటపెట్టారు. కానీ అప్పట్లో వైరల్ కాలేదు. ఇప్పుడు రవిప్రకాష్ ఆర్టీవీ డిజిటల్ లో మంచి ఇమేజ్ తెచ్చుకోవడం.. స్వయంగా ఆయనే తెరపైకి వస్తూండటంతో హైలెట్ అవుతున్నాయి. ఈ నకిలీ బ్యాంక్ గ్యారంటీల స్కాం ఏ మలుపు తిరుగుతుందో ?