స్మార్ట్ ఫోన్ లో యాప్స్ అన్నీ పని చేయడం ఆగిపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోతుందని… మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితికి వెళ్లిపోతాడని ఎవరైనా ఊహించగలరా ?. ఊహించలేరు. కానీ అదే పచ్చి నిజం. శుక్రవారం చోటు చేసుకున్న మైక్రోసాఫ్ట్ స్ట్రైక్డౌన్ వ్యవహారంతో ప్రపంచానికి శాంపిల్ సీన్ కనిపించింది. మనిషి ఎంత మాయా ప్రపంచంలోకి వెళ్లిపోయాడో .. పని చేసుకోవడం ఎలా మార్చిపోయాడో… సాఫ్ట్ వేర్ లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంత దీన స్థితికి ఎలా వెళ్లిపోయాడో శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.
ఊబిలోకి జనం – బయటపడే మార్గం ?
ఏదైనా ఊబిలోకి దిగుతున్నప్పుడు బయటకు రావడానికి ఓ మార్గం ఏర్పాటు చేసుకోవాలి. కఠినమైన మార్గమైనా ఓ దాన్ని ఉంచుకోవాలి. కానీ పనులన్నీ సింపుల్ గా అయిపోవాలన్న ఆలోచనతో వేగంగా టెక్నాలజీని.. సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకుంటూ చిటికెలో పని చేసుకుంటూ మొత్తం భారందానిపైనే వేస్తూ వచ్చాడు. ఇప్పుడు మానన జీవితం ఎలా అయిపోయిదంంటే… కాసేపు ఇంటర్నెట్ లేకపోతే పిచ్చోళ్లయిపోయేవాళ్లు కోట్లలో ఉంటారు. యాప్స్ పని చేయకపోతే.. ఒక్క అడుగు వేయలేని వాళ్లు ఎందరో. తిండి తినడానికీ కూడా టెక్నాలజీ పై ఆధారపడే పరిస్థితి.
మొత్తం ఒకే సారి ఆగిపోతే మనిషి బతకలేడు !
ఒక్క మనిషి కాదు.. అన్ని రకాల వ్యాపారాలు, వ్యవస్థలు అన్నీ సాఫ్ట్ వేర్ పైనే ఆధారపడుతున్నాయి. సింపుల్ గా ప్రాసెస్ చేసుకుని పని పూర్తి చేసుకుంటున్నాయి. ఒక వేళ ఆ సాఫ్ట్ వేర్ కు సమస్య వస్తే తమ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయలేదు. ఫలితంగా శుక్రవారం.. స్కైన్యూస్ అనే చానల్ ఆఫ్ ఎయిర్ అయిపోయింది. వేల విమానాలు రద్దయ్యాయి. స్టాక్ మార్కెట్లు ఆగిపోయాయి. బ్యాంకులపైనా ఎఫెక్ట్ పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే .. మరో మార్గం మూసుకున్న ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి ?
ఇప్పటికైనా ప్రత్యామ్నాయం చూసుకోవాలి !
మనిషి ఇంటర్నెట్, టెక్నాలజీ ఊబిలోకి చిక్కుకుపోయాడు. బయటకు రావడం అసాధ్యం. ఇప్పుడు చేయాల్సింది… ప్రత్యామ్నాయాలను కూడా రెడీ చేసుకోవడమే. మాన్యువల్‌గా కూడా పనులు చేసుకునేలా బద్దకాన్ని వదిలించుకోవడమే. ఒక్క క్లిక్ తో పని చేసే సాఫ్ట్ వేర్లు రాక ముందు కూడా విమానాలు నడిచాయి. .. బ్యాంకులు నడిచాయి… కంపెనీలు నడిచాయి. వాటికి సాఫ్ట్ వేర్ తో పని లేదు. వేగంా ప ని చేయడానికే అవి వచ్చాయి. కానీ ఆ పాత పనుల్ని మర్చిపోవడమే అసలు విషాదం. భవిష్యత్ లో మొత్తం షట్ డౌన్ అయ్యే ప్రమాదం లేదని.. రాదని అనుకోవడం .. అమాయకత్వమే. అందుకే ప్లాన్ బీ ని ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి. అదే ఇప్పుడు కీలకం.