ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ముప్పు ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని సంఘ విద్రోహశక్తుల గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. పవన్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పవన్ కల్యాణ్ భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో పవన్ కల్యాణ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నాయి.
Read Also: Security Threat to Dy CM Pawan Kalyan: Concerns, Consequences and Speculations
కనీసం ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్ తో జగన్ జడ్ ప్లస్ సెక్యూరిటీ పొందుతున్నారు. అయినా ప్రభుత్వంపై నిందలేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. కానీ జగన్ కు ఎలాంటి ముప్పు లేదని. ..కానీ వైసీపీ మార్క్ రాజకీయాలు చూస్తే… వారి నుంచే ముప్పు ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతారు. చంద్రబాబుపై ఎన్నో సార్లు రాళ్ల దాడులు చేసి హత్యాయత్నం చేశారు. ఆయనపై భారీ కుట్ర జరిగినట్లుగా కేంద్రం గుర్తించి.. రెట్టింపు సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
ఇప్పుడు పవన్ వైసీపీ విజయానికి అడ్డుగా నిలబడి.. ఆ పార్టీని పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నించడంతో పవన్ పై కొంత మంది కోపం పెంచుకున్నారు. ఇలాంటి వారు ఏమైనా గ్రూపుల్లో పవన్ ను టార్గెట్ చేశారేమో తెలియదు కానీ.. పవన్ కల్యాణ్ కు మాత్రం సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని రిపోర్టు వచ్చినట్లయింది.