ఫోన్ ట్యాపిం గ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు , ఐ న్యూస్ చానల్ ఎండి శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రభాకర్ రావు తాను అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని వర్చువల్ గా విచారణకు హాజరవుతానని కోర్టుకు చెప్పారు. కానీ కోర్టు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులను పోలీసులు ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సిట్ బృందం గుర్తించింది. శ్రవణరావు ఆచూకీని మాత్రం ఇప్పటికీ తెలియడం ేదు.
ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు. ఆయన దొరికితే ఇదంతా ఎవరి కోసం చేశారన్నది పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాక ర్ రావు ఆచూకీ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఆయన ఎలా వీసా గడువు పెంచుకుంటున్నారో కానీ అమెరికాలోనే ఉంటున్నారు.
Read Also:తూచ్.. ట్యాపింగ్ ప్రభాకర్ రావు రావట్లేదు !
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ రావట్లేదు. వారికి బెయిల్ రావాలన్నా… ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి విచారణకు సహకరించాల్సి ఉందన్న వాదన వినిపిస్తోంది. ఆయన వస్తే కేసీఆర్, కేటీఆర్ లను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. రాకపోతే ఇప్పుడున్న అధికారులకు బెయిల్ కష్టం. రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసినందున ఆయన ఎక్కువ రోజులు దాక్కోలేరని తెలంగాణ పోలీసులు నమ్ముతున్నారు. ఆయన వచ్చాకనే మళ్లీ ట్యాపింగ్ కేసు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి.