లాంగ్ వీకెండ్ వస్తోందంటే.. టాలీవుడ్ లోని నిర్మాతలు అలెర్ట్ అయిపోతారు. ఎలాగైనా దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తారు. అలా.. ఆగస్టు 15 అందరికీ హాట్ కేక్‌లా మారిపోయింది. నిజానికి ఆగస్టు 15న ‘పుష్ష 2’ రావాల్సింది. అది వస్తే.. సోలో రిలీజ్ ఉండేది. కానీ ‘పుష్ష 2’` వాయిదా పడేసరికి, ఆ ప్లేస్ లో ఏకంగా 5 సినిమాలు రిలీజ్‌కు రెడీ అంటున్నాయి.
‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బబ్చర్’, ’35’, ‘ఆయ్’ చిత్రాలు పంద్రాగస్టు విడుదలకు సిద్దమయ్యాయి. ఆయా నిర్మాణ సంస్థలు విడుదల తేదీ కూడా ప్రకటించేశాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమా ‘తంగలాన్’ ఉంది. విక్రమ్ సినిమా అది. టీజర్ ఆకట్టుకొంది. తప్పకుండా బలమైన కంటెంట్ అందులో ఉందన్న నమ్మకం కలిగిస్తోంది. ‘పుష్ష 2’ వచ్చినా సరే, అదే రోజున ‘తంగలాన్’ విడుదల చేద్దామని మేకర్స్ ఫిక్సయ్యారు. దాన్ని బట్టి ఆసినిమాపై దర్శక నిర్మాతలకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవొచ్చు. ఆగస్టు 15 డేట్ ముందుగా లాక్ చేసింది పూరినే. ‘పుష్ష 2’ ఎప్పుడైతే వాయిదా పడిందో, అప్పుడే కర్చీఫ్ వేసేశారు. సో.. ‘డబుల్ ఇస్మార్ట్’ చెప్పిన డేట్ కు రావడం ఖాయం. ‘మిస్టర్ బచ్చన్’ కూడా ఆగదు. ఇక ‘ఆయ్’, ’35’ రెండూ చిన్న సినిమాలే. కాకపోతే.. వెనుక సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంది. `ఆయ్` గీతా ఆర్ట్స్ నుంచి వస్తోంది. ’35’కి రానా నిర్మాత. మాస్ సినిమాల పక్కన చిన్న సినిమాలు ఆనవు. రవితేజ, రామ్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. విక్రమ్ కూడా గట్టి పోటీ ఇస్తాడు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు వాయిదా పడడమే మంచిదనిపిస్తోంది. ఆగస్టు 15కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి, ఆ రెండు సినిమాలూ విడుదల విషయలో పునరాలోచించుకోవడం మంచిది.